శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడించాడు. Xలో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ పోటీలో పాల్గొన్నానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో గాయమైందని చెప్పాడు.
Neeraj Chopra qualifies for Diamond League Final: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌కు అర్హత సాధించాడు. బ్రస్సెల్స్ వేదికగా సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో ఈ పోటీలు జరగనున్నాయి. జూరిచ్ డైమండ్ లీగ్‌లో పాల్గొననప్పటికీ.. నీరజ్ 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ (29 పాయింట్లు), జర్మనీ క్రీడాకారుడు జులియన్…