డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్…
కరోనా కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ మరింతగా పెరిగింది. కర్ఫ్యూ లాక్ డౌన్ వంటివి అమలు జరుగుతుండటంతో కొంత సమయం మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతులు ఉండటంతో ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకుంటున్నారు. ఉదయాన్నే లేవడం వలన ఆరోగ్యం పదిలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా త్వరగా లేచే వారికి గుండె జబ్బులు, ఊబకాయం వంటివి దరిచేరే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేచే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.…