Dhoni: క్రికెటర్ ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి నచ్చిన పనులు చేస్తూ, జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ధోని త్వరలో సినిమా రంగంలోకి రానున్నాడు, సినిమాలు నిర్మించబోతున్నాడు అని పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీపావళి నాడు ధోని తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి తన మొదటి సినిమాని ప్రకటించాడు. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మించబోతున్నట్లు తెలిపారు.
Read Also: Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా
ఈ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కు ధోని భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రమేష్ తమిళమని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆయన రాసిన అథర్వ-ది హరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోని-తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కించనున్నారు. కాగా తమిళంలో తన తొలి సినిమాను తెరకెక్కించిన తర్వాత-తెలుగు, మలయాళం లో వరుసగా ఎంఎస్ ధోని సినిమాలను పట్టాలెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఉండొచ్చని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తోంది.
Read Also:Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్గా బంగారమా..!
ఈ సినిమా గురించి సాక్షి మాట్లాడుతూ… ఈ చిత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా కథను సాక్షినే రాశారు. దీనిపై తమిళ్ మణి మాట్లాడుతూ… సాక్షి రచించిన కథను తాను చదివిన క్షణంలో అద్భుతమైన అనుభూతికి గురయ్యానని చెప్పారు. కథ చాలా కొత్తగా ఉందని… ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రజలను ఆకట్టుకునే సత్తా ఈ కథకు ఉందని అన్నారు. మరి… క్రికెటర్ గా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న ధోనీ… సినీ రంగంలో ఎంత వరకు రాణిస్తారనే విషయాన్ని వేచి చూడాలి.