IPL అంటే ఒకప్పుడు CSK జట్టుతో ఏ జట్టు ఫైనల్ ఆడుతుందో దాన్నే IPL అని అంటారు అనే స్థాయిలో ఆ జట్టు IPL ని ఒక ఊపు ఊపింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట తాజాగా జరిగిన IPL 2022 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన CSK పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. 15 ఏళ్ల IPL చరిత్రలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించడం ఇది రెండోసారి. కెప్టెన్‌గా రవీంద్ర జడేజా దారుణంగా విఫలవమవడం.. స్టార్ పేసర్ దీపక్ చాహర్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడం, స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం వంటి చెన్నై పతనాన్ని శాసించాయి.
ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలిచిన చెన్నై.. ఐదో ట్రోఫీపై కన్నేసింది. ఆ క్రమంలోనే వచ్చే సీజన్‌లో టీమ్‌ను పటిష్టంగా మార్చాలనుకుంటుంది. ఈ నేపథ్యంలోనే జట్టులోని ఓ నలుగురి ఆటగాళ్లను వదిలేయాలనుకుంటుంది. మరి వారెవరో చూద్దామా..
1. క్రిస్ జోర్డాన్
ఇంగ్లండ్ T20 స్పెషలిస్ట్ క్రిస్ జోర్డాన్‌ను చెన్నై మెగా వేలంలో రూ.3.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ జోర్డాన్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. చెత్త బౌలింగ్‌తో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి, ధారాళంగా పరుగులిచ్చాడు.
2. తుషార్ దేశ్ పాండే
భారత ఆటగాడు తుషార్ దేశ్ పాండే ను రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై కొనుగోలు చేసింది. దీపక్ చాహర్‌కు బ్యాకప్‌గా ఉంటాడని భావించి అతనిపై CSK నమ్మకం ఉంచింది. కానీ దీపక్ చాహర్ గాయంతో దూరమవ్వడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడించగా.. అతను దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ మాత్రం తీసి ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు.
3. రాబిన్ ఊతప్ప
IPL 2021 సీజన్‌లో చెన్నై టైటిల్ గెలవడంలో రాబిన్ ఊతప్పది కీలక పాత్ర. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌ల వరకు బెంచ్‌కే పరిమితమైన ఊతప్పకు సురేశ్ రైనా గాయపడటంతో జట్టులో చోటు దక్కింది. కీలక క్వాలిఫయర్, ఫైనల్లో మాత్రం సత్తా చాటాడు. దాంతో అతన్ని మళ్లీ కొనుగోలు చేసింది చెన్నై. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఊతప్ప ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 3, 30, 1, 1,0, 1 దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో 20.90 సగటుతో ఊతప్ప 230 పరుగులే చేశాడు.
4 ఆడమ్ మిల్నే
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నే కేవలం ఒకే మ్యాచ్ ఆడి, గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో CSK శ్రీలంక పేసర్, జూనియర్ మలింగా మతీషా పతిరణతో అతని స్థానాన్ని భర్తీ చేసుకుంది. మతీషా తనదైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో అతన్ని ధోనీ జట్టులో కొనసాగించాలని అనుకుంటున్నాడు.