రౌడీ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ లెక్క వేరే లెవెల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ హీరో స్టైల్ కు బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే తన సినిమా కోసం బిటౌన్ ముద్దుగుమ్మ అనన్య పాండేతో కలిసి నటిస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ డాటర్, స్టార్ హీరోయిన్ మనసులో స్థానం సంపాదించుకున్నాడు. బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తాజాగా విజయ్ దేవరకొండ వెరీ హాట్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : ఇజ్రాయెల్ మాజీ ప్రధానితో హీరోయిన్ భేటీ… బహుమతిగా భగవద్గీత
ధనుష్, అక్షయ్ కుమార్ లతో కలిసి సారా అలీ ఖాన్ నటిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ “అత్రంగి రే'” చిత్రం డిసెంబర్ 14న విడుదల కాబోతోంది. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సారా ఎక్కువగా పాల్గొంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన సారా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆనంద్ ఎల్ రాయ్ వంటి ప్రతిభావంతులైన దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. అంతేకాదు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను ఈ సందర్భంగా బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. విజయ్ దేవరకొండ చాలా హాట్ గా, కూల్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది సారా. ఇక మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటూ కోరికను వెల్లడించిన విషయం తెలిసిందే.