సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు.
Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్… విడుదలకు ముందే లీక్
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న రెండు సినిమాలు ‘రక్షా బంధన్’, ‘అత్రంగి రే’ రెండు చిత్రాల టైటిల్స్ ను రిజిస్టర్ చేయించడానికి ఫిల్మ్ అసోషియేషన్‌కి వెళ్లారట. అయితే అక్కడ ‘ఆత్రంగి రే’ టైటిల్ ను అప్పటికే సల్మాన్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌజ్ పేరిట రిజిస్టర్ చేయించారట. టైటిల్ కోసం ఆనంద్ సల్మాన్ ను కలవగా ఆయన ఓ షరతు పెట్టారట. అదేంటంటే ఈ సినిమాను ఆనంద్ డైరెక్ట్ చేస్తేనే టైటిల్ ఇస్తానని అన్నారట. లేదంటే ఆ టైటిల్ ను వదిలే ప్రసక్తే లేదని సల్మాన్ చెప్పారట.
కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆత్రంగి రే’ చిత్రంలో సారా అలీఖాన్, అక్షయ్ కుమార్, సౌత్ సూపర్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఈ ముగ్గురు స్టార్స్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.