ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుల జాబితాలో చేరిపోయాడు. దీంతో ‘మారన్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది పొంగల్‌కు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also : అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
దీంతో ఒక్కసారిగా ధనుష్ అభిమానులు ‘మారన్’ను థియేటర్లలోనే విడుదల చేయాలి అని ట్విట్టర్‌లో పట్టుబడుతున్నారు. గతంలో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ ఓటీటీలో విడుదలైనప్పుడు, ధనుష్ తనకు సినిమా ఓటిటీలో విడుదల కావడం ఏమాత్రం ఇష్టం లేదని ట్వీట్ చేశాడు. దీంతో ‘మారన్’ చిత్రం ఓటీటీలో ఖచ్చితంగా విడుదల కాదని భావించారు. అయితే తాజాగా లీక్ అయిన సమాచారంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో ధనుష్ అభిమానులు ‘మారన్‌ను థియేటర్లలో విడుదల చేయాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. కాగా ధనుష్ నెక్స్ట్ మూవీ “నానే వరువేన్”. ధనుష్, దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించనున్నారు.

తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!