ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్ అని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) అజయ్‌సింగ్ చెప్పుకున్నారు. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టరే (పీఎల్ఎఫ్) దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 80 శాతానికి పైనే సీట్లు నిండాయని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ కూడా ఇచ్చారు. అందులో…
భారతదేశంలోకి మరో ఎయిర్ లైన్ సంస్థ అడుగుపెట్టబోతోంది. బిలియనీర్, షేర్ మార్కెట్ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ‘ ఆకాశ ఎయిర్’ త్వరలోనే ఇండియాలో తన సేవలను ప్రారంభించబోతోంది. ఆకాశ ఎయిర్ కమర్షియల్ విమానాలను ప్రారంభించేందుకు ఏమియేషన్ రెగ్యులేటర్ అథారిటీ, డీజీసీఏ నుంచి అనుమతి వచ్చింది. ఆకాశకు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏఓసీ) ను డీజీసీఏ ఇచ్చింది. దీంతో ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఫ్లైట్స్ నడపడానికి మార్గం సుగమం అయింది. డీజీసీఏ నిర్ణయంపై ఆకాశ ఎయిర్ హర్షం వ్యక్తం…
చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్నప్పటికీ ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరించినందుకు, ఆ తర్వాత వారికి ఎలాంటి నష్టపరిహారం అందించనందుకు ఎయిర్ ఇండియాపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) మంగళవారం రూ.10 లక్షల జరిమానా విధించింది. “డీజీసీఏ వరుస తనిఖీలు చేసిన తర్వాత మరియు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో మా నిఘా సమయంలో, ఎయిర్ ఇండియా విషయంలో నిర్దిష్ట సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నిబంధనలు పాటించలేదు. విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయబడింది మరియు వ్యక్తిగత విచారణకు…
కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది… ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.. ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు, అది కూడా ప్రభుత్వ అనుమతితో.. మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.. దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం… ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.. కోవిడ్…
కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాతో డిసెంబర్ 17 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్దరించాలని సివిల్ ఏవియేషన్ మొదట ప్రకటించింది. అయితే, దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం, యూరప్ దేశాల్లో వేగంగా కరోనా వ్యాపిస్తుండటం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రపంచంలోని అనేక దేశాల్లో బయటపడటంతో అంతర్జాతీయ విమానాల సర్వీసులపై డీజీసీఐ పునరాలోచనలో పడింది. కరోనా మహమ్మారి మొదటి వేవ్ సమయంలో వివిధ దేశాల్లో చిక్కున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు వందేభారత్ పేరుతో కొన్ని విమానాలను నడిపారు.…
డెల్టా నుంచి బయటపడ్డాం అనుకునేలోగా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించడంతో ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. కట్టడి చేసేందుకు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. Read: 12 దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్… అప్రమత్తమైన ఇండియా… అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు…
అంతర్జాతీయ విమానాలపై మరోసారి నిషేధం పొడిగించింది భారత్ ప్రభుత్వం.. సెకండ్ వేవ్ కేసులో ఇంకా అదుపులోకి రాకపోగా.. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 30వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని పొడిగంచింది కేంద్రం.. అయితే, కార్గో విమాన సర్వీసులకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అంతర్జాతీయ షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్లపై గతంలో విధించిన…
కరోనా కల్లోలం ప్రారంభమైనప్పట్టి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ నిషేధం విధించింది.. భారత్ నిర్ణయం తీసుకుని దాదాపు 11 నెలలు అవుతుంది.. కరోనా ఫస్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలోనూ నిషేధం పొడిఇస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా, మరో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది.. జూన్…
నిన్న చెన్నైలో విమానంలో జరిగిన పెళ్లి పై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు అనుమతినిచిన ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి కరోనా టైంలో పెళ్లికి విమానం అద్దెకు ఇచ్చిన స్పైస్ జెట్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. ఫ్లయిట్ లో కనీసం భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ లు ధరించకపోవడం పై అసహాయం వ్యక్తం చేసింది. కరోనా…