తెలుగుపాటకు వెలుగురేఖలు పొదిగిన వారిలో దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి కలం భలేగా పరుగులు తీసింది. చిత్రసీమలో అడుగు పెట్టక ముందే తెలుగుదేశమంతటా కృష్ణశాస్త్రి భావకవిత్వం చిందులు వేసింది. సినిమా రంగంలో ‘మనసున మల్లెల మాలలు ఊగించిన కవి’గా నిలచిపోయారు కృష్ణశాస్త్రి. ఆకాశవీధిలో సాగే మేఘమాలలతో ప్రేయసీప్రియుల నడుమ రాయబారాలు నడిపి, ‘చిత్ర మేఘసందేశం’ పలికించిన ఘనుడాయన! ‘పాడనా తెలుగు పాట…’ అంటూ పరవశింప చేసినదీ ఆయనే! ఏ తీరున చూసినా తెలుగు పాటల తోటలో కృష్ణశాస్త్రి వేసిన…