రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…