BJP: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై నగర భద్రత కోసం ఒక ‘‘ఖాన్’’ నగర మేయర్ కాకూడదని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి బీజేపీ ముంబై చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరైన బీజేపీ విజయ్ సంకల్ప్ మేళావాలో అమీత్ సతం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబై సురక్షితంగా ఉంచడమే యుద్ధం. విదేశీ చొరబాట్లు పెరుగుతున్నాయి. వారు తమ రంగును మారుస్తున్నారు. కొన్ని నగరాల మేయర్ల ఇంటిపేర్లు చూడండి. ముంబైకి అదే పరిస్థితి కావాలా..?’’ అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!
సతం చేసిన ఈ వ్యాఖ్యలు పాశ్చాత్య దేశాల్లో వలసల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనల గురించి అని భావిస్తు్న్నారు. ఇంటి పేరు వ్యాఖ్యల పాకిస్తాన్ మూలాలు కలిగిన లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌ను సూచిస్తోంది. ముంబై బీజేపీ చీఫ్ తన విమర్శల్ని కొనసాగిస్తూ.. ‘‘వెర్సోవా-మాల్వానీ పరిస్థితి ముంబైలోని ప్రతీ ప్రాంతానికి వ్యాపించవచ్చు. ప్రతీ ముంబై పౌరుడి ఇంటి ముందు ఒక బంగ్లాదేశీయుడు ఉంటాడు. రేపు, ప్రతీ వార్డులో హరూన్ ఖాన్ ఎన్నిక కావచ్చు. ఖాన్ ముంబైకి మేయర్ కావచ్చు. అది జరగనివ్వొద్దు’’ అని ప్రజల్ని కోరారు.
ముంబైలోని వెర్సోవా, మల్వానీలో గణనీయ సంఖ్యలో ముస్లిం జనాభా ఉంది. అక్రమ బంగ్లాదేశీయులపై రాష్ట్రవ్యాప్తంగా అణిచివేత చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2022 నుంచి ముంబై కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జనవరి 31, 2026 లోగా మహారాష్ట్రలో పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తుది గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముందుగానే తన ప్రచారాన్ని మొదలుపెట్టింది.