బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఆ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎంపిక చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం జేపీ నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ క్లారిటీ ఇచ్చారు. జాతీయ మీడియా చర్చావేదికలో ఆయన వివరణ ఇచ్చారు. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండదని.. ఇది కేవలం బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం అని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: త్వరలో మోడీ-ట్రంప్ భేటీ.. అమెరికా వర్గాలు సంకేతాలు
బీజేపీ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి సంఘ్‌కు అయితే ఇంత సమయం పట్టేది కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా ఫడ్నవిస్ స్పందించారు. అధ్యక్షుడి ఎంపిక అనేది బీజేపీ తీసుకునే నిర్ణయం అని చెప్పారు. అయితే దీనికొక ప్రక్రియ ఉంటుందని.. ఆర్ఎస్ఎస్ జోక్యం ఉండదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రజల ఆదాయం పెంచుతున్నాం.. జీఎస్టీ సంస్కరణలు నిరంతర ప్రక్రియ
బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సరైన సమయంలో జరుగుతుందని.. ఎటువంటి సమస్యలు లేవు అని ఫడ్నవీస్ అన్నారు. బీజేపీ అధ్యక్ష ఎన్నికలపై నిర్ణయాలు తీసుకునే కమిటీలో తాను భాగం కానందున దీనికి సమాధానం చెప్పేంత సమర్థుడిని కాదని తెలిపారు.