Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే.. మ్యాచ్‌లో గిల్-రోహిత్ రన్ అవుట్ వివాదం వైరల్‌గా మారింది. మ్యాచ్ అనంతరం ఈ అంశంపై గిల్ మాట్లాడుతూ.. “రోహిత్ భాయ్ రిప్లే చూశాక అంతా ఓకే అనుకున్నారు. తను గత మ్యాచ్‌లో కూడా రన్ అవుట్ అయిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఏమాత్రం అసంతృప్తిగా లేరు” అని గిల్ స్పష్టం చేశాడు. అలాగే కొత్త బౌలర్లు గుర్నూర్, హర్ష్ దూబే ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేసిన తీరును కెప్టెన్ కొనియాడాడు.
ఇక, 195 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మంచి ఆరంభం లభించినప్పటికీ, కెప్టెన్ గిల్‌తో జరిగిన పొరపాటు (Mix-up) వల్ల రోహిత్ శర్మ 16 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. వన్డే క్రికెట్లో రోహిత్ రన్ అవుట్ కావడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి. ఈ దురదృష్టకర అవుట్‌తో రోహిత్ తీవ్ర అసహనంతో పెవిలియన్ చేరాడు. అయితే, ఈ వికెట్ పడినప్పటికీ భారత్ ఏమాత్రం తడబడలేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!