Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
- ధర్మశాల వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే
- ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్
- కాన్ఫరెన్స్‌లో తల్లి ఫోన్‌కు స్పందించిన నితీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తల్లి ఫోన్‌కు స్పందించిన విధానం అభిమానుల మనసులు గెలుచుకుంది.
ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నితీశ్ రెడ్డికి అతని తల్లి ఫోన్ చేశారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ ప్రశ్న అడుగుతుండగా ఫోన్ చూసిన నితీశ్.. కాల్ లిఫ్ట్ చేశాడు. ‘అమ్మ.. ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను’ అని చెప్పి కాల్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పి.. తిరిగి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ సరదా సంఘటన అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ‘అమ్మ ఫోన్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతే’, ‘అమ్మతో అట్లుంటది మరి’ అంటూ కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. యువ ఆటగాడి వినయం, కుటుంబానికి ఇచ్చే గౌరవం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
Also Read
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
- Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
- Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
ఈ మ్యాచ్‌లో నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు కీలక వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌తో పాటు సీనియర్ మహ్మద్ నబీ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత బౌలింగ్ దాడిలో కీలకంగా మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026లో నితీశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 13 ఇన్నింగ్స్‌లలో 302 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ కూడా ఉంది . బౌలింగ్‌లో ఎనిమిది వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన విలువను నిరూపించాడు. అతని నిలకడైన ప్రదర్శన ఫలితంగానే భారత జట్టులో అవకాశం దక్కింది.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!