తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి. ఇలియానా డిక్రూజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్…