డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో సంఘటన స్థలానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి చేరుకున్నారు. మన దళిత జాతికి మనమే సైనికుల నిలబడదం.., ఒక్కొక్క నా కొడుకుని ఏమి చేయాలో అది చేద్దాం మనకు ఎవరు వద్దు.., చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేయడానికి వచ్చాడా లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. Also Read:…
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే దాదాపు సగానికి పైగా హామీలను అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఎన్నీ హామీలను అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు..
ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వెంకటేశ్వర్లు ఇవాళ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.