చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో సంఘటన స్థలానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి చేరుకున్నారు. మన దళిత జాతికి మనమే సైనికుల నిలబడదం.., ఒక్కొక్క నా కొడుకుని ఏమి చేయాలో అది చేద్దాం మనకు ఎవరు వద్దు.., చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేయడానికి వచ్చాడా లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.
Also Read: Allagadda: అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం.. వివరాలు ఇలా..
డిజిపికి ఫోన్ చేస్తే ఎలక్షన్ అవగానే మీ కూతురే గెలుస్తుంది అన్నా.. అప్పుడు వాళ్ళని తొక్కేస్తానని అన్నాడని., సిఐఎస్ఐ లకు ఫోన్ చేస్తే మేమేం చేసేది సార్.. ఎస్పీ వన్ సైడ్ చేయమన్నాడు అని చెప్తున్నారని పోలీసులపై విమర్శలు చేసారు. ఇంతవరకు బాగున్న వాళ్ళు కూడా ఈ ఎస్పీ వచ్చాక వన్ సైడ్ ఉండమన్నారని చెప్తున్నారు ఇక మనకు మనమే దిక్కు అంటూ.. మనకి పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు.
Also Read: Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ