6th Day Assemble Meeting: ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో విద్యుత్‌పై స్వల్ప చర్చ జరిగింది. ఈ సందర్భంగా 24 గంటల కరెంట్, విద్యుత్ మొండి బకాయిలపై వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. యాదాద్రి..భద్రాద్రి..ఛత్తీస్ ఘడ్ పుణ్యమా అని వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ అప్పులు చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందన్నారు. మాజీ మంత్రి అందరికి అప్పులు ఉంటాయంటున్నారు. మరి నేను ఏమి అప్పులు చేయలేదు.. నాకేం అప్పులు లేవు. కానీ.. నాకు ఇచ్చిన శాఖల్లో లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. తెలంగాణ ఆస్తులు లక్ష కోట్లకుపైగా పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హరీష్ రావు అవాస్తవాలు చెప్పారు. ఆస్తులకంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి.
Also Read: Revanth vs Akbaruddin: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. నేతల మధ్య మాటల తూటాలు
వ్యవసాయంకు విద్యుత్ వినియోగం పెరిగింది. 24 గంటల కరెంట్ ఇచ్చామని చెప్పుకున్నారు.. కానీ ఎక్కడ ఇచ్చారు. మసిపూసి మారేడు కాయ చేసి చూపెట్టారు’ అని భట్టి మండిపడ్డారు. అలాగే వ్యవసాయంకు విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ప్రాజెక్ట్‌లు కట్టి కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నామన్నారు. కాలువల ద్వారా నీళ్లు వస్తే బోర్లు ఎందుకు పుట్టుకొచ్చాయి. ప్రాజెక్టుల నుండి నీళ్లు పారితే.. బోర్లు వేసుకుంటారా? రైతులు 10 లక్షల బోర్లు వేశారు. వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగింది.. కాలువలతో నీళ్లు ఇచ్చామని చెప్పుకున్నారు. కానీ.. డిస్కంల అప్పులు పెరిగిపోయాయి. ఉచితంగా విద్యుత్ ఇచ్చాం అన్నారు.. మరి బిల్లులు ప్రభుత్వం కట్టాలి కదా? పదేళ్లు బిల్లులే కట్టలేదు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
Also Read: Assembly Meeting: కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం.. సీఎం మాట్లాడుతుండగా సభలో బీఆర్ఎస్ రచ్చ