Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానితో భేటీపై స్పందించారు. ‘ప్రధానితో అరంగంట సేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆయనతో చర్చించాం. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానిని కోరాం.
Also Read: Law Student Arrest: మాజీ ప్రియుడిపై పగ.. కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన లా స్టూడెంట్
స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే అందించాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరాం. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించాం. 10 ఏళ్లు పాలించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణను కొట్టాడి తెచ్చుకున్నాం. కానీ ఆ నీళ్లు, నిధులు, నియామకాలనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని భట్టి వివరించారు.
Also Read: Delhi: ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క