Dollars: అప్పడాల మాటున అమెరికా డాలర్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పడాలు, మసాలా దినుసుల మాటున అమెరికా డాలర్లు తరలిస్తూ దొరికిపోయాడో వ్యక్తి.. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికిచేరుకున్నాడు ఓ వ్యక్తి… అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అతడి లగేజీని చెక్ చేశారు.. వాటిలో మసాలా దినుసుల బాక్సులు, అప్పడాల పాకెట్లు కనిపించాయి… అంతే కాదు.. అక్కడే ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది.. అప్పడాల మధ్యలో దాదాపు 19,900 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 15 లక్షలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు..
Read Also: Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం యొక్క టెర్మినల్ 3 వద్ద భద్రతా తనిఖీల సమయంలో ఉదయం 5 గంటలకు ఓ ప్రయాణీకుడి లగేజీని తనిఖీ చేశాం.. పాపడ్ ప్యాకెట్లలో దాచిన రూ. 15 లక్షల విలువైన డాలర్లు కలిగి ఉండడాన్ని గుర్తించాం.. మసాలా దినుసుల బాక్స్‌లు, పాపాడ్ ప్యాకెట్ల మధ్య డాలర్లు దాచి ఉంచాడని ఓ సీనియర్ అధికారి తెలిపారు.. మొత్తం 19,900 అమెరికా డాలర్ల విలువ.. ప్రస్తుత విలువ ప్రకారం రూ. 15.5 లక్షలుగా చెబుతున్నారు.. ఆ వ్యక్తిని తన ఎయిర్ విస్తారా విమానం నుంచి కిందకు దించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కాగా, భారీ ఎత్తున బంగారం, విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు తరలిస్తూ నిత్యం ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడే ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం.. కొత్త కొత్త తరహాలో బంగారాన్ని, డ్రగ్స్‌ను తలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.
- Tags
- airport
- Delhi
- Delhi airport
- Dollars
- Man
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!