ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.
Karnataka Cabinet Expansion: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై రచ్చ మొదలైంది. నిన్నటి నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం మధ్య, మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రకటించింది. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ డాక్టర్ జాన్ బ్రిట్టాస్ ఈ వార్తను ధృవీకరించారు. కాగా, రాష్ట్రపతిని ప్రధాని మోదీ దాటవేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ కీలక పోరులో ఢిల్లీ క్యాపటిల్స్ పై 77 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయాన్ని అందుకుంది.
Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు.
Kejriwal : రిజర్వు బ్యాంక్ ఇండియా నిన్న(శుక్రవారం) పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి జనాలకు ఝలక్ ఇచ్చింది. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని నడిరోడ్డుపై నిలబెట్టేశారు. ఏటిఎంలలో నొట్లను మార్చుకునేందుక ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
Bus Driver : ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదనేది ఢిల్లీ ప్రభుత్వం తాజా చర్యతో హెచ్చరించింది. దేశ రాజధానిలోని ఓ బస్ స్టాప్‌లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళల్ని ఎక్కించుకోకుండా ఆపకుండా వెళ్లిపోయిన బస్సు డ్రైవర్ ను సస్పెండ్ చేసింది.