వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి గురువారం వాయు సేన పతకాన్ని అందించారు. ఆమె శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా నిలిచారు.
Firing at Delhi's Saket court: ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటన జరగగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన మహిళను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. అయితే అదిలోనే కేకేఆర్ జట్టుకు ఢిల్లీ షాక్ ఇచ్చింది. పపర్ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను తీసుకుంది.
భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో యాపిల్ సీఈఓ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేసి ఓ వ్యక్తిని ఓ బాలుడు హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని హతమార్చినందుకు 16 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Matrimonial fraud: ఈ మధ్య మాట్రిమోనీ మోసాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. బయట పెద్దలు కుదిర్చే సంబంధాలకు విలువే లేకుండా పోతోంది. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ అమ్మాయికి మంచి భర్తను తీసుకురావాలని భావిస్తూ ఈ మాట్రిమోనీ వెబ్ సైట్లపై ఆధారపడుతున్నారు. మంచి ఉద్యోగం, ఆస్తులు, కార్లు, విల్లాలు ఉన్న వ్యక్తుల్ని వెతికి మరీ పట్టుకుంటున్నారు. తమకు దగ్గరి బంధువుల నుంచి వచ్చే అబ్బాయిలను అసలు పట్టించుకోవడమే లేదు.
మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్లో ఏప్రిల్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని ద్వారకా జిల్లాలోని బిందాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మటియాలా రోడ్లో తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం స్థానిక బీజేపీ నాయకుడు సురేంద్ర మతియాలాను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు ‘దేశ వ్యతిరేకులు’ మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు.