ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం సోమవారం ఆలస్యం కావడంతో చెన్నై విమానాశ్రయంలో సుమారు 150 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ విమానం సోమవారం ఉదయం 10.05 గంటలకు చెన్నై నుంచి బయలుదేరాల్సి ఉంది.
నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, ముంబై నగరాలను చేరాయి. రుతుపవనాల రాకతో రెండు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల కారణంగా దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానిలో ఒకేసారి వర్షాలు కురవడం 62 ఏళ్లలో ఇదే తొలిసారి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి.
ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది.
ఢిల్లీలోని వికాస్ పురిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని సీసీ కెమెరాల్లో గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. ఈ నేరానికి సంబంధించి సోమవారం వికాస్పురి పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
అప్పులు ప్రాణాలు తీస్తాయని పెద్దలు ఎప్పుడు చెప్తుంటారు.. అది నిజమే అని చాలా సార్లు రుజువైంది..అప్పుల వల్ల కుటుంబాలు విచ్చిన్నం అవ్వడమే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది..అప్పు విషయంలో చెలరేగిన ఓ గొడవ ఇద్దరు మహిళల ప్రాణాలను తీసుకుంది. తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి మీద చేసిన దాడిలో అతని ఇద్దరు సోదరీమణులు మృతి చెందడం విషాదాన్ని నింపింది.. ఈ విషాద ఘటన ఢిల్లీలో…
మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణం చేసిందని ఢిల్లీ బీజేపీ ఆరోపించింది. ఇది వందల కోట్ల కుంభకోణమని ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. మద్యం, విద్య, హవాలా వంటి కుంభకోణాల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో పెద్ద కుంభకోణానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది.
ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.