ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు.
మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్లో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెజ్లర్లపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ మూడుసార్లు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పదవి చేపట్టినందున మరోసారి ఆయనను ఎన్నుకోరాదని రెజ్లర్లు పట్టుబట్టారు.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్.. హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Surgery : వృద్ధాప్యంలో ఎముక విరిగితే చాలా కష్టం. వయసు రీత్యా అతుక్కోవడానికి చాలా టైంపడుతుంది. అదే వెన్నుముకకు గాయమైతే అంతే సంగతులు మంచానికి పరిమితం కావాల్సిందే. ఇలాంటి క్లిష్టమైన ఈ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం కనుగొంది.
ఢిల్లీలోని సాక్షి హత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు భారీ ఊరట లభించింది. నిందితుడు సాహిల్ సాక్షిని 20కి పైగా పొడిచి చంపిన కత్తిని రిథాలా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అత్యవసరంగా తన పిటిషన్ ను విచారించాలని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును కోరారు. అయితే.. దీనిని అత్యవసర విచారణకు అంగీకరించబోమని సుప్రీంకోర్టు ఇవాళ తెల్చి చెప్పేసింది.