దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
ఢిల్లీలో వరదలు రావడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ పేరు ఎత్తకుండా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీని ముంచేసే కుట్ర జరిగిందని ఆప్ సర్కార్ ఆరోపించింది.
టమోటాల ధరలు దాదాపు డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాయి.. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా ధరలు డబుల్ అవుతున్నాయి.. ఒకప్పుడు రూ.10 పలికిన కిలో టమోటా ఇప్పుడు కిలో రూ.160 నుంచి రూ.200ల వరకు అమ్ముతున్నాయి.. పెరిగిన ధరల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జనాలకు సబ్సిటీతో టమాటాలుఅమ్మాలని నిర్ణయించింది. దేశంలో మొత్తం టమాటా పంటల ఉత్పత్తిలో 56-58 శాతం దక్షిణ, పశ్చిమ భారత్ నుంచే జరుగుతోంది. దీంతో కేంద్రం ఎక్కువ టమాటాల ఉత్పత్తి ప్రాంతాల్లో…
దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఇప్పటికే వరద నీటితో ఉన్న ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఇప్పుడిప్పుడే నది ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.62 మీటర్లుగా నమోదైంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకు యమునా నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది.
ఢిల్లీ రాష్ట్ర మద్యం కుంభకోణం కేసులో స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.