Heavy Rains: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని చూపుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 56 రోడ్లు నీట మునిగాయి.
ఈరోజుల్లో ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం.. అమాయికులుగా ఉంటూనే రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు.. పైన పటారం లోన లోటారం అనే సామెతకు తగ్గట్లు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇంట్లో నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.. కుటుంబ సభ్యులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు..తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.. భార్యను శారీరకంగా, మానసికంగా క్షోభకు గురించేస్తున్నాడు..పోర్న్ వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్న భర్త భార్యకు నరకం చూపిస్తూ వస్తున్నాడు.. ఓ ప్రబుద్దుడు తన భార్యను అలాగే తనతో సెక్స్ చేయాలంటూ…
ఢిల్లీ మద్యం పాలసీలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా, ఇతర నిందితుల రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు.
Delhi: ఢిల్లీలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. అనేక హత్యల్లో కాంట్రాక్ట్ కిల్లర్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ గాయపడ్డాడు. లొంగిపోవాలని కోరినా కూడా కమిల్ పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు తిరిగి జరిపిన కాల్పుల్లో అతను గాయపడ్డారు. తరువాత అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో…
తెలంగాణ బీజేపీలో సంచలన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధిష్టానం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కీలక పదవిని వరించింది. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. జేపీ నడ్డా ఆదేశాల మేరకు బీజేపీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.
ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో ఉదయం రోడ్డు కుంగింది. బుధవారం ఉదయం ప్రధాన రహదారి మధ్యలో ఉన్నట్టుండి కుంగిపోయింది. 4 గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై అదృష్టవశాత్తూ ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు.