Delhi Records Cleanest Air in July for Last 4 Years: దేశ రాజధాని ఢిల్లీ ‘వాయు కాలుష్యం’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాహనాల నుంచి వెలుబడే పొగ, చలికాలంలో వచ్చే పొగ మంచుతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నుంచి వచ్చే పొగతో ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. వాయు నాణ్యత సూచీ ఒక్కోసారి నాలుగు వందలకు పైగా కూడా నమోదవుతుంది. సూచీలో 401 నుంచి 500 మధ్య ఉంటే దానిని తీవ్రస్థాయిగా పరిగణిస్తారు. వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో.. ఢిల్లీ ప్రజలు శ్వాస పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుంటుంది. అయితే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంతగా వాయు నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మెరుగుపడింది. వర్షాలు, గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణం పూర్తిగా శుభ్రపడటంతో.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజాగా 83.71గా నమోదైంది. రాజధాని ఢిల్లీ జులైలోని 31 రోజులు ‘గుడ్ టు మోడరేట్’ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను చూసింది. పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఢిల్లీలో జూలై నెలలో స్వచ్ఛమైన గాలి వీచిందట. గత నాలుగు సంవత్సరాలలో ఇదే కాలంతో పోల్చితే.. వాయు నాణ్యత అత్యల్ప సగటు 83.71గా ఉంది.
Also Read: IND vs WI: భారత్‌తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు ఆయేగా
ఢిల్లీలో శనివారం నమోదైన వాయు నాణ్యతే ఈ సంవత్సరంలో అత్యంత స్వచ్ఛమైన వాయు నాణ్యతగా రికార్డుల్లో నిలిచింది. సాధారణంగాఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 51 నుంచి 100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన వాయు నాణ్యతగా పేర్కొంటారు. ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. వర్షాలు, గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణం మెరుగుపడినా.. మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, వాయు నియంత్రణ సంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజ సంస్థలు మరియు పౌరులు ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడం కూడా ఢిల్లీని ఊపిరి పీల్చుకునేలా చేశాయి.