కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో బిల్లులు ప్రవేశ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అన్నారు. తెలంగాణలో వరదలపై కొనసాగుతున్న రాజకీయంపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో వరద సమయంలో ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీ ఒకరు అమెరికాకు వెళ్లి చాలా ఎక్కువ మాట్లాడారు.. రైతుల మీద ప్రేమ అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకు ఉంది అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Patna High Court: నితీశ్ సర్కార్‌కు ఊరట.. కులగణనకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
రైతులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవరికి రైతులు ఉరెస్తారో చూడు అని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో దిక్కు లేదని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు.. రైతులు మా వెంటే ఉన్నారు.. వరద సాయం కోసం కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.. రాష్ట్రం అంతటా నష్ట పరిహారం ఇస్తున్నాం.. పార్లమెంటులో మాట్లాడేందుకు ఎన్నో అంశాలున్నాయి.. అవన్నీ వదిలి కేసీఆర్ పర్యటనల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి అని రంజిత్ రెడ్డి అడిగారు.
Read Also: RCF Ltd Recruitment: కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. చూస్తు ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రైతులకు అబద్దాలు చెప్పి కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని అన్నారు.