Gaming addiction: మొబైల్, ట్యాబ్‌లలో ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిసలుగా మారుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ యువత ఈ పబ్‌జీ వంటి గేమ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇలా, గేమింగ్ వ్యసనం వల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో, ఢిల్లీలోని 19 ఏళ్ల యువకుడి ఘటన చూస్తే అందరికి అర్థమవుతుంది. రోజులో 12 గంటల పాటు పబ్‌జీ గేమ్ ఆడుతూ, గేమింగ్‌కి వ్యసనంలో మునగడం వల్ల ఒక సదరు టీనేజర్ ‘‘పాక్షిక పక్షవాతానికి’’ గురయ్యాడు. చివరకు వెన్నెముకకు సర్జరీ…