Delhi MLA's : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చర్యలకు నిరసనగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు సభకు ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఇంటినుంచి అడుగు బయట పెట్టాలంటేనే రాజధానివాసులు జంకుతున్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం అంటున్నారు ఎంపీలు. తెలంగాణలో ప్రారంభమయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశరాజధానికి విస్తరించింది. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు. కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో…
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేము మీకు 24 గంటలు ఇస్తున్నాము. మీరు దీనిని తీవ్రంగా పరిశీలించి, సీరియస్‌గా పరిష్కారం చూపాలని…
ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పొల్యూషన్ తగ్గినా.. కేసు మూసివేసేది లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతోనే కోర్టులు జోక్యం చేసుకో వాల్సిన అవసరం వస్తుందనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కోర్టు తీసుకున్న కొన్ని చర్యల వల్ల 40 శాతం కాలుష్యం తగ్గిందని కొన్ని వార్తాపత్రికలు పేర్కొన్నాయని చెబుతున్నారని, అవి సరైవనో కాదోతెలియదని సొలిసీటర్ జనరల్‌తో పేర్కొన్నారు. ఈ…
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు…
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. చాలా వాహనాలు లీటర్‌కు కనీసం 40 కిలో మీటర్లు కూడా రావడంలేదు. దీంతో సామాన్యుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాడు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడు శాతం…