దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది. దీంతో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం 361 ఉండగా.. బుధవారం ఉదయం 400 దాటేసింది. దీంతో పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.…
Delhi pollution: ఢిల్లీలో కాలుష్యానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో రావడమే అని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం అన్నారు. నగరంలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి ఇతర రాష్ట్రాల బస్సులే కారణమవుతున్నాయని, బస్ డిపోల్లో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యత 230 కాగా, ఈరోజు(శుక్రవారం) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 293గా నమోదు అయింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈరోజు (సోమవారం) ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొనింది.
Delhi Weather: నిన్నటి వరకు కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి పెద్ద ఊరట లభించింది. వరుణ దేవుడు దీపావళికి కానుకను ఇచ్చాడు. ఢిల్లీ-నోయిడాలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురిసింది.
Delhi Pollution: ఢిల్లీ-ఎన్సీఆర్ కాలుష్యం ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలు గ్యాస్ ఛాంబర్లుగా మారాయి. గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన విభాగంలో ఉంది.