దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. చాలా వాహనాలు లీటర్‌కు కనీసం 40 కిలో మీటర్లు కూడా రావడంలేదు. దీంతో సామాన్యుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాడు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడు శాతం మేర పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జులై నుంచి సెప్టెంబర్ వరకు 1.5 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా అందులో 7869 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.