BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి నది శుభ్రపరిచే అవగాహన డ్రైవ్ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా యమునా నదిలో జారిపడి పడ్డాడు. రవీందర్ సింగ్ ని అతని బృందం వెంటనే రక్షించింది. ఈ సంఘటనలో నేగి నది ఒడ్డున నిలబడి, రెండు సీసాలు పట్టుకుని, సమతుల్యత కోల్పోయి నీటిలో పడిపోయాడు. సమీపంలోని ఒక వ్యక్తి సహాయం చేయడానికి పరుగెత్తాడు. కానీ అప్పటికే అతడు నీళ్లలో పడిపోయాడు. తాను బయట పడేందుకు ఒక వెదురు లాంటి నిర్మాణాన్ని…
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈద్ ప్రార్థనలపై మరోసారి రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నాయకులు 'రోడ్డుపై నమాజ్'కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల తర్వాత.. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎమ్‌ఐఎమ్ రంగంలోకి దిగింది. ఇది ఢిలలీ, సంభాల్ లేదా మీరట్ కాదని మసీదులో స్థలం కొరత ఉంటే రోడ్డుపై కూడా నమాజ్ చేస్తామని ఏఐఎమ్‌ఐఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమాయ్ అన్నారు. దీనికి ఆయన కన్వర్ యాత్ర వాదనను ఇందులో ప్రస్తావించారు.
Delhi : నేడి నుంచి రాజధాని ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికార పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.
Delhi : 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను నియమించగా, అసెంబ్లీ స్పీకర్ పదవికి విజేంద్ర గుప్తా పేరును ఖరారు చేశారు.
Delhi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని అన్ని అధికారులతో సమావేశం నిర్వహించింది.
Delhi : రాజకీయ లాభం కోసం ఎన్నికలకు ముందు ఉచిత పథకాలు అందించడం వంటి వాటికి ప్రస్తుతం చట్టపరమైన నిర్వచనం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి దీనికి సమాధానం కోసం వెతుకుతోంది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో…
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని జహంగీర్‌పురిలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నిన్న నేను ఢిల్లీలోని వికాస్‌పురికి వెళ్లానని, అక్కడ బీజేపీ.. గూండాలను పంపి నన్ను చంపేందుకు ప్రయత్నించింది. నాపై దాడి చేశారు. మీకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయండి.