ఈద్ ప్రార్థనలపై మరోసారి రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నాయకులు ‘రోడ్డుపై నమాజ్’కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల తర్వాత.. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎమ్‌ఐఎమ్ రంగంలోకి దిగింది. ఇది ఢిలలీ, సంభాల్ లేదా మీరట్ కాదని మసీదులో స్థలం కొరత ఉంటే రోడ్డుపై కూడా నమాజ్ చేస్తామని ఏఐఎమ్‌ఐఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమాయ్ అన్నారు. దీనికి ఆయన కన్వర్ యాత్ర వాదనను ఇందులో ప్రస్తావించారు.
READ MORE: Mamata Banerjee: లండన్ టూర్‌లో నిరసన సెగ.. తిప్పికొట్టిన సీఎం మమత
షోయబ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు్ చేశారు. ‘ఢిల్లీలో ఈద్ ప్రార్థనల గురించి బీజేపీకి చెందిన కొంతమంది పెద్ద నోరున్న నాయకులు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఇది సంభాల్ లేదా మీరట్ కాదు. ఇది ఢిల్లీ. ఢిల్లీ అందరిది అని వారు తెలుసుకోవాలి. ఈద్ నమాజ్ ఇక్కడ కూడా నిర్వహిస్తారు. మసీదులో తగినంత స్థలం లేకపోతే, రోడ్డుపై కూడా నమాజ్ చేస్తారు. ఈద్గాలలో, ఇళ్ల స్లాబ్‌లపై కూడా నమాజ్ జరుగుతుంది. ఎలాగైతే.. కవాడ్ యాత్ర సమయంలో ప్రధాన రహదారిని చాలా గంటలు మూసివేస్తారో.. అలాగే నమాజ్ సమయంలో 15 నిమిషాలు బంద్ చేయాలి. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం పోలీసు యంత్రాంగం బాధ్యత.” అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆయన రాసుకొచ్చారు.
READ MORE: Ameenpur: అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను చంపిన తల్లి.. ఎస్పీ రియాక్షన్..!
కాగా.. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ షకుర్ బస్తీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈద్ కు ముందు రాసిన ఈ లేఖలో “నగరంలోని రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంది.” అని పేర్కొన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్ కూడా ఇలాంటి కారణాలు చెప్పి బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ నిషేధించాలని డిమాండ్ ను లేవనెత్తారు.