Delhi: ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి నుంచి బయటపడేందుకు చాలామంది మంటలు వేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈ మంటలే కొన్ని చోట్ల ప్రజల మరణాలకు దారి తీస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. భారతదేశంలోని మొదటి ఐదు స్టార్టప్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.. దీనిపై సుప్రీంకోర్టు సైతం స్పందించిన విషయం తెలిసిందే కాగా… ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది… ఢిల్లీతో పాటు సమీప నగరాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగానే ఈ సమయంలో ఢిల్లీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉంటుంది.. ఇక, దీపావళి నుంచి ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు…
పాల ధరలను మరోసారి పెంచేసింది మదర్ డెయిరీ.. ఢిల్లీ-ఎన్సీఆర్ నగరంలో మదర్ డెయిరీ లీటరు పాలపై 2 రూపాయలు చొప్పున పెంచుతూ ఇవాళ నిర్ణయంతీసుకోగా… పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.. అన్ని రకాల పాలకు పెరిగిన ధరలు వర్తిస్తాయని పేర్కొంది మదర్ డెయిరీ.. ధర పెంపుకు కారణం ఖర్చులు పెరగమే అంటోంది మదర్ డెయిరీ.. 2019లో పాల ధరలు పెంచగా.. కరోనా మహమ్మారి సమయంలో.. పాల సేకరణ, ప్రాసెస్, ప్యాకింగ్, రవాణ ఖర్చులు…