Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో గాలి కాలుష్యం బాగా క్షీణించింది. ఈ క్రమంలో శీతాకాలం, పండుగలు వస్తుండటంతో వివిధ రాష్ట్రాల్లోని వైద్యారోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలను జారీ చేసింది.
ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. 'భారత్ జోడో యాత్ర' వరకు సీరియస్ నేతగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఆపిల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్‌లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
ఢిల్లీలోని డీడీఏ భూమిపై వక్ఫ్ బోర్డు దావాను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు డీడీఏ అంటే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ భూమిలో రాణి లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మెరుపులు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Semicon India 2024: సెమికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గ్రేటర్ నోయిడాకు రానున్నారు. ప్రధాని ఉదయం 10:20 గంటలకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌కు చేరుకుంటారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం, చిల్లా రెడ్…
Earthquake in Delhi NCR: గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.