DY Chandrachud: ఢిల్లీలో కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్ చేయడం మానేశాం..
- ఢిల్లీలో రోజురోజుకు క్షీణించిపోతున్న గాలి నాణ్యత..
- గాలి నాణ్యతపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు సీజేఐ..
- వాయు కాలుష్యంతో మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DY Chandrachud: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కమ్మేయడంతో రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కాలుష్యం మాత్రం తగ్గిపోవడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదే విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మార్నింగ్ వాక్‌కు వెళ్లడం కూడా మానేసినట్లు వెల్లడించారు. సాధారణంగా తాను ఉదయం 4 నుంచి 4.15 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్తానని చెప్పారు.
Read Also: KTR: వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్ కీలక కామెంట్..
Also Read
కానీ, ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక, గడిచిన వారం రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో దేశంలోనే అత్యంత అధ్వానమైన గాలి నాణ్యతను ఢిల్లీలో నమోదు అయింది. రాష్ట్రాలు అవసరమైన కాలుష్య నిరోధక చర్యలను పాటించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్, హర్యానా సర్కార్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read Also: Free Gas Cylinders: ఉచిత సిలిండర్ల పథకం.. షరతులు ఇవే..!
ఇక, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఏ అమానుల్లా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పంజాబ్, హర్యానా రాష్ట్రాల ప్రభుత్వాలకు పంట వ్యర్థాలను కాల్చడాన్ని అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే విషపూరిత పొగలు తరచుగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించేలా చేస్తుందని మండిపడ్డారు. అలాగే, రాజధాని ఏరియాలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏర్పాటైన సంస్థ తన టార్గెట్ ను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.
తాజావార్తలు
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!