Big Win For AAP In Delhi Municipal Election, Show 2 Exit Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ స్వీప్ చేయబోతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తొలిసారిగా…
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4న నిర్వహించబడుతుంది.