ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది.
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.
విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.