MLC Kavitha : లిక్కర్ స్కాంలో ఈడీ 7వ చార్జ్ షీట్.. ఎమ్మెల్సీ కవిత పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్డ్ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కె.కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా ఛార్జిషీటును దాఖలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ను ఫెడరల్ ఏజెన్సీ మార్చి 15న అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 13న చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చే వారం ఇదే విధమైన ఫిర్యాదు దాఖలయ్యే అవకాశం ఉంది.
శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్‌తో సహా ఇప్పటివరకు 18 మందిని అరెస్టు చేసిన ఈ కేసులో ఇడి చేసిన ఏడవ ఛార్జ్‌షీట్ ఇది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం లైసెన్సుల్లో పెద్ద వాటాకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూ. 100 కోట్లు కిక్‌బ్యాక్‌లు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ‘సౌత్ గ్రూప్’లో కవిత కీలక సభ్యురాలు అని ED ఆరోపించింది. 2021-22 ఎక్సైజ్ పాలసీలో కొంత భాగం మద్యం వ్యాపారుల అవినీతి, కార్టలైజేషన్ ఆరోపణల కారణంగా రద్దు చేయబడింది. “ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో కీలక కుట్రదారు మరియు లబ్ధిదారుల్లో కింగ్‌పిన్‌లలో కవిత ఒకరు” అని ఏజెన్సీ గతంలో పేర్కొంది.
Also Read
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
శుక్రవారం మధ్యంతర బెయిల్ పొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ఈ చార్జ్‌షీట్‌లో పేర్కొనలేదు. వచ్చే వారంలోగా కేజ్రీవాల్‌పై ప్రత్యేక సప్లిమెంటరీ ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.ఈ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులతో సహా ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు ఈడీ చేసింది. సంజయ్ సింగ్‌కు కొంతకాలం క్రితం రెగ్యులర్ బెయిల్ మంజూరైంది.
తాజావార్తలు
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!