ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరుకావాలంటూ గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తెలిపింది. ఇప్పటి వరకు మూడు సార్లు కేజ్రీవాల్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మూడోసారి కూడా సమన్లను దాటవేశాడు. అయితే ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, కేవలం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే లక్ష్యమని ఆప్ ఆరోపించింది.
ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో ఇరికించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడమే కాకుండా..ఆయనకు వ్యతిరేకంగా పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్ష నాయకులను ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.