ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరకడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామంపై సుప్రీం ధర్మాసనం కూడా చాలా సీరియస్ అయింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నగదు వ్యవహారం కేసు పెను సంచలనంగా మారింది. అటు న్యాయస్థానాలు.. ఇటు పోలీసుల మధ్య తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఇదిలా ఉంటే అగ్నిప్రమాద సమయంలో దొరికిన డబ్బుతో తనకెలాంటి సంబంధం లేదంటూ జడ్జి యశ్వంత్ వర్మ తోసిపుచ్చుతున్నారు.