ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితులకు బెయిల్ లభించింది. మనీ లాండరింగ్ కేసులో మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్‌లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, కవిత, విజయ్ నాయర్ కూడా ఇదే కేసులో బెయిల్‌పై బయటకు వచ్చారు. అనంతరం.. ఈ ఇద్దరికీ బెయిల్ మంజూరైంది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఆమె సర్వీస్‌ను నిలిపివేయడంతో పటు భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు.
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC…
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటేచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకోవడంతో చర్చకు దారితీసింది.
Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.