దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా పాఠశాలల లక్ష్యంగా ప్రతిరోజూ బాంబ్ బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు బాంబ్ బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్‌పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు…
భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ఉరిశిక్ష అమలును వాయిదా వేసిన యెమెన్. నిమిష ప్రియను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. హత్య కేసులో నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. జూలై 16, బుధవారం ఉరిశిక్ష అమలు చేయాలని ముందుగా నిర్ణయించారు. ఆమె 2017 నుంచి యెమెన్‌లో జైలులో ఉంది. యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన…
Delhi High Court: ఒక వ్యక్తి వివాహేతర సంబంధం భార్యను వేధించినట్లు లేదా హింసించినట్లు చూపించకపోతే అది క్రూరత్వం లేదా ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. భర్త వివాహేతర సంబంధం భార్య వరకట్న మరణానికి పాల్పడటానికి కారణం కాదని జస్టిస్ సంజీవ్ నారులా అన్నారు.
RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్ సంస్థతో…
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ‘షర్బత్ జిహాద్’ అనే పదాన్ని వాడడం ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంది. కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.
High Court: కస్టమర్ల ఫుడ్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలను చెల్లించడం వారి ఇష్టమని, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా విధించలేవని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులపై సర్వీస్ ఛార్జీలను తప్పనిసరి చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ, రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తన తీర్పులో.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని,…
High Court: ఇటీవల కాలంలో విడాకులు, తప్పుడు కేసులను పేర్కొంటూ భర్తల్ని హింసించే భార్యల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా లేని ‘‘భరణాన్ని’’ డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఇటీవల సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కీలక వ్యాఖ్యలు చేశాయి. తాజాగా, ఢిల్లీ హైకోర్టు మహిళ దాఖలు చేసిన ‘‘భరణం’’ పిటిషన్‌పై కామెంట్స్ చేసింది. సంపాదించే సామర్థ్యం ఉన్న, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి మధ్యంతర భరణాన్ని కోరకూడదని ఢిల్లీ హైకోర్టు…