Delhi: ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్‌పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు.
Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు.
సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ స్పందనను న్యాయస్థానం కోరింది. ఈ మేరకు దర్యాప్తు సంస్థనకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును జూలై 17న విచారణకు వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. రెండు వేర్వేరు పిటిషన్లు వేయగా.. రెండింటినీ ధర్మాసనం తిరస్కరించింది.
Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పుడు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్, ఆప్ నేతలకు భంగపాటు ఎదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే కొనసాగించింది.
లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆవిరైపోయింది. బెయిల్ సంతోషం ఆప్ నేతలకు ఎన్నో గంటలు లేకుండా పోయింది. ఢిల్లీ కోర్టు.. కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
Aravind Kejriwal : తక్షణమే బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు చేరిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆశలకు గండి పడింది. హైకోర్టు తీర్పు కోసం వేచిచూడాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు కోరింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విడుదలపై స్టే విధించాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.