ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు.
ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరో 5 రోజులు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరోసారి దాడులు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. అతడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్దకు ఉదయం 11.00 గంటలకు మనీష్ సిసోడియా చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తులను ఎందుకు కలిశారని ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆప్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపి విడుదల చేసింది.