దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు.