CSK VS DC : చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 69 పరుగులు చేశాడు. ధోనీ 26 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. రచిన్ రవీంద్ర (3), డేవాన్ కాన్వే (13), రుతురాజ్ గైక్వాడ్ (5), శివమ్ దూబె (18), రవీంద్ర జడేజా (2) రన్స్ మాత్రమే చేశారు.
Read Also : CM Revanth Reddy : HCU భూముల తప్పుడు ప్రచారం పై ప్రభుత్వం సీరియస్
ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ 2, మిచెల్ స్టార్క్, ముఖేశ్ కుమార్, కుల్‌దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 3 సిక్స్ లు, 6 ఫోర్లతో 77 రన్స్ చేసి భారీ స్కోర్ అందించాడు. అతనికి తోడుగా అభిషేక్ పోరెల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 33 పరుగులు సాధించాడు. అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20 పరుగులతో ఆకట్టుకున్నారు. చివర్లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 22 రన్స్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ నిర్దేశించిన టార్గెట్ ను ఛేధించడంలో చెన్నై బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఢిల్లీకి వరుసగా మూడో విజయం దక్కగా.. చెన్నైకి ఇది వరుసగా మూడో ఓటమి.