టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఢిల్లీకి 186 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. రియాన్ పరాగ్ అద్భుతమైన ముగింపుతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగింది.
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది.
ఐపీఎల్ – 2024 సీజన్ ను పంజాబ్ కింగ్స్ గెలుపుతో ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 3 : 30 కుజరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఆడిన సంచలన బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రెండో మ్యాచ్ లో ఢిల్లీపై పంజాబ్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సామ్ కరణ్ (63), లివింగ్ స్టోన్ (38*) పరుగులతో రాణించడంతో జట్టు విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఓపెనర్లు శిఖర్ దావన్ (22), బెయిర్ స్టో (9) పరుగులు చేశారు. ఆ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో శనివారం రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో పంజాబ్-ఢిల్లీ తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. చివరలో అభిషేక్ పోరల్ (32) పరుగులతో రాణించాడు. చివరి ఓవర్లోనే 4,6,4,4,6,1 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు పోరాడే స్కోరు చేసింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ బ్యాటింగ్ లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్…
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇవాళ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాను కౌగిలించుకున్నాడు. అయితే, నిన్న రోహిత్ ఎంఐ టీమ్ తో చేరాడు.. ఈ సందర్భంగా ఇవాళ తన మొదటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా రోహిత్ వద్దకు వెళ్లి అతడ్ని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్…
Delhi Capitals Players Reach Vizag for IPL 2924: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సొంత మైదానాల్లో సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ కాపిటల్స్ టీమ్ సభ్యులు కొందరు సోమవారం విశాఖకు చేరుకుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆటగాళ్లు.. రోడ్డు మార్గాన రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కి వెళ్లారు. డీసీ క్రికెట్ డైరెక్టర్…