కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని, తప్పిదాలను సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌కు సిద్దమవుతామని చెప్పాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత ప్రతీ రోజును ఎంతో ఆస్వాదిస్తున్నానని పంత్ చెప్పకొచ్చాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏకంగా 106 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్…
విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు సిక్సర్ల, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగాఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా 16వ మ్యాచ్ లో, ఢిల్లీ క్యాపిటల్స్ ఏప్రిల్ 3 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు జట్లూ విజయంతో బరిలోకి దిగుతున్నాయి. నేడు వైజాగ్ లో ఢిల్లీకి రెండో మరియు చివరి హోమ్ మ్యాచ్. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తమ మిగితా ఐదు హోమ్ గేమ్ లను ఆడనుంది. చెన్నై సూపర్…
Delhi Capitals Team Visits GMR Engineering College: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం (మార్చి 31) విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం సోమవారం చెన్నై టీమ్ హైదరాబాద్ చేరుకోగా.. ఢిల్లీ జట్టు మాత్రం విజయనగరం జిల్లా రాజాంలో సందడి చేసింది. సోమవారం మధ్యాహ్నం రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలను ఢిల్లీ జట్టు సందర్శించింది. అక్కడి విద్యార్థులతో ప్లేయర్స్…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైపై గెలిచింది. 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఈ గెలుపుతో ఢిల్లీకి తొలి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో అటు చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓటమి నమోదైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖలో మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (52), కెప్టెన్ రిషబ్ పంత్ (51) పరుగులతో రాణించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ జట్లు తలపడనున్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో ఈ మ్యాచ్ లో కూడా గెలువాలనే కసితో ఉంది. మరోవైపు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించాలని కోరుకుంటుంది.